epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ జిల్లాలో వరి నాట్లు వెరీ స్పెషల్

కలం,వెబ్ డెస్క్ : నిజామాబాద్(Nizamabad) జిల్లాలో మగవారు నాట్లు వేస్తున్నారు. వేగంగా ఎక్కువ ఎకరాలలో చక్కగా నాట్లు వేయడం వారి ప్రత్యేకత. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో ‘నాటు నాటు‘ పాట ఎంత పాపులర్ అయ్యిందో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న మగ కూలీలు వేస్తున్న నాట్లు కూడా అంతే పాపులర్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలో వరినాట్లు వేయడం, కలుపు తీయడం వంటి పనులు మహిళలు చేస్తుండగా.. ఒడ్డు చెక్కడం, దమ్ము కొట్టడం, మందులు చల్లడం వంటి పనులు మగ వారు చేస్తుంటారు. కానీ ఉత్తరాది నుంచి పోటెత్తుతున్న మగ కూలీలు ఇక్కడి పరిస్థితులను పూర్తిగా మార్చేస్తున్నారు. మహిళా కూలీల కొరత కూడా ఏర్పడటంతో ఇక్కడి రైతులు పొరుగు రాష్ట్రాల కూలీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో గోదావరి నదీపరీవాహక ప్రాంతాలు నలుమూలలా ఎటుచూసినా ఉత్తరాది నుంచి వచ్చిన కూలీలే కనిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ పనుల్లో బిజీగా మారి స్థానిక కూలీల కొరతను తీరుస్తున్నారు. పొరుగు రాష్ట్రాల కూలీల నాటు చక్కగా ఉండటంతో పాటు మద్యలో ఎడం ఎక్కువగా ఉండేలా, సమాన దూరం ఉండటానికి వరుసగా రావడానికి దారంతో కొలిచి మరీ వరినాట్లు వేస్తున్నారు.

మగ కూలీలు నాటు పనుల్లో ఆరి తేరారు. క్రమపద్ధతిలో నాటడం మూలంగా దిగుబడులు సైతం పెరుగుతుండటంతో స్థానిక రైతులు కూడా పొరుగు రాష్ట్రాల కూలీలపైనే ఆధారపడుతున్నారు. యాసంగి పనులు ఊపందుకోవడంతో ఏజెంట్లకు డిమాండ్ పెరుగుతుంది. రైతులు ముందుగా పొరుగు రాష్ట్రాల కూలీలను తీసుకొచ్చే ఏజెంట్లను సంప్రదిస్తే అవసరమైనంత మందిని వారి పొలాల్లోకి నాట్లు వేయడానికి పంపిస్తారు. ఏజెంట్లు ముందుగా ఆయా రాష్ట్రాల్లోని గ్రూప్ సభ్యులకు అడ్వాన్స్ రూ.30 నుంచి 40 వేల వరకు ఒక్కో గ్రూప్ నకు చెల్లిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి నీటి వసతితో పాటు బియ్యం, వంట చేసుకునేందుకు గ్యాస్ సిలిండర్ సదుపాయం కల్పించాలి. కూలీలు ఇతర నిత్యావసరాలతో పాటు కూరగాయాలు సమకూర్చుకుంటారు. అందుకు గాను స్థానిక డిమాండ్‌ను బట్టి ఎకరాకు రూ.4500 లను స్థానిక రైతుల నుంచి ఏజెంట్లు వసూలు చేసి పొరుగు రాష్ట్రాల కూలీలకు రూ.4200 వరకు ముందస్తు ఒప్పందం ప్రకారం చెల్లిస్తారు. ఒక్కో గ్రూపులో 15 నుంచి 24 మంది కూలీలు ఉంటారు. వారిని ఆయా ప్రాంతాల్లో కూలీ పనులకు ఏజెంట్లే తరలించాల్సి ఉంటుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>