జూనియర్లపై సీనియర్ల వేధింపులు.. ఎన్ఎంసీకి ఫిర్యాదు

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో(Government Medical College) ర్యాగింగ్ (Ragging) కలకలం రేపింది. పలువురు జూనియర్లతో సీనియర్ విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించారు. సీనియర్లు కొందరు తమను వేధిస్తున్నారంటూ జూనియర్లు వారం రోజుల క్రితం ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్ ( ఎన్ఎంసీ) యాంటీ ర్యాగింగ్ సెల్ కు ఆన్ లైన్లో ఫిర్యాదు చేశారు.

ఎన్ఎంసీ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఇంటర్నల్ ఎంక్వైరీ చేపట్టారు. విచారణలో సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. విచారణ కమిటీ మెడికల్ కాలేజి ప్రొఫెసర్లు అధికారులు వెంటనే సమావేశమయ్యారు. ర్యాగింగ్ అంశాన్ని అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ఈ ర్యాగింగ్ అంశం ఢిల్లీ దాకా చేరుకోవడంతో కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>