కలం, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీల్లో లే ఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన డిజైన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కాన్వా తమ ఉద్యోగులపై వేటు (Canva Layoffs) వేయనుంది. కంపెనీ చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ చర్య వల్ల 1,271 మంది ఉద్యోగులు, ప్రపంచవ్యాప్తంగా సంస్థకు పనిచేస్తున్న ఉద్యోగుల్లో 22 శాతం మందిపై ప్రభావం పడనుంది.
లే ఆఫ్స్ పై కాన్వా కంపెనీ సీఈవో మెలాని పెర్కిన్స్ తమ ఉద్యోగులకు సందేశం పంపించారు. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు ఉద్యోగులకు క్షమాపణలు తెలిపారు. “ఇప్పటివరకు మాకు ఇదే అత్యంత కష్టమైన సంవత్సరం,” అని ఆమె పేర్కొన్నారు. దశాబ్ద కాలంలో కాన్వా వృద్ధి మొదటిసారిగా నష్టాలు చవిచూసిందని చెప్పుకొచ్చారు.
Also Read : భారత్–పాక్ సరిహద్దులో కుట్ర.. రైల్వే ట్రాక్ బ్లాస్ట్!
Follow Us On: X(Twitter)

