కండక్టర్ ప్రవళిక మృతిపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి

కలం, ఖమ్మం బ్యూరో: టీజీఎస్ ఆర్టీసీ మణుగూరు డిపోకు చెందిన మహిళా బస్సు కండక్టర్ గుండ్ల ప్రవళిక (Conductor Pravallika) మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రవళిక ఆకస్మిక మృతి పట్ల వారు వేర్వేరు ప్రకటనల్లో ప్రగాఢ సంతాపం తెలిపారు.
​
ఈ విషాద సమయంలో ప్రవళిక కుటుంబం ఒంటరిది కాదని, రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Also Read : ‘కాన్వా’లో లే ఆఫ్స్​.. 1,271 మందిపై వేటు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>