కలం, వెబ్ డెస్క్: పూణే మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడి (Suresh Kalmadi) మంగళవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. కల్మాడీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, పూణేలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కల్మాడీ తొలిసారిగా 1980లో కాంగ్రెస్ ఎంపీగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1986లో రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. మూడోసారి 1992లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
1996లో తొలిసారిగా లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు, ఆ తర్వాత 2004, 2009లో కూడా ఎన్నికయ్యారు. పూణే నగర అభివృద్ధిలో సురేష్ కల్మాడీ ప్రధానంగా కీలక పాత్ర పోషించారు. అలాగే సాంస్కృతిక రంగంలో కూడా కీలకంగా వ్యవహరించారు. 2011లో CWC కుంభకోణం తర్వాత కల్మాడిని కాంగ్రెస్ (Congress) పార్టీ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత.. కల్మాడీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.


