వైద్యం వికటించి బాలింత మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

కలం, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలింత మృతి (Postpartum Woman) చెందిన ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుటుంబ సభ్యురాలి మృతికి కారణమని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాలింతకు ఆస్పత్రిలో అందించిన వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

వైద్యులు సరైన చికిత్స అందించకపోవడంతోనే ఈ విషాదం చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆస్పత్రి ఎదుట బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరి ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలింత మృతికి గల అసలు కారణాలు, వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరిగిందా లేదా అన్న విషయాలు విచారణలో తేలాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>