మురసు తుఫాన్‌తో పంటలకు నష్టం: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: మురసు తుఫాన్ (Murasu Cyclone) కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయని వివరించారు. సుమారు 3 లక్షల హెక్టార్లలో వరి, 22 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. అర్నబ్ తుఫాన్ కారణంగా రూ.4,526 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రెండు తుఫాన్ల కారణంగా వచ్చిన వరదలతో 625 టీఎంసీల వరద ప్రవహించినట్లు చెప్పారు. ఆర్టీజీఎస్ సాయంతో తుఫాన్ రాకను 90 శాతం వరకు కచ్చితంగా అంచనా వేసి.. ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించామన్నారు.

అధికారులకు అభినందనలు..

అర్నబ్, మురసు తుఫాన్లు వెంటవెంటనే వచ్చినా అధికారులు చాలా బాగా పనిచేశారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా విపత్తుల సమయంలో ఇలాగే సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజలు సైతం ముందుకొచ్చి ప్రభుత్వ సహాయక చర్యలకు సహకరించారన్నారు. సుమారు 4 వేల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించడంపై ధన్యవాదాలు తెలిపారు. లోతట్టు ప్రాంతాలకు ప్రజలను ముందుగానే తరలించడం కూడా ఎంతో మేలు చేసిందన్నారు.

Also Read : మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ హవా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>