త్వరలో ‘భూధార్’ కార్డులు అందజేస్తాం : మంత్రి పొంగులేటి

​కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ పరిధిలోని ఏదులాపురం మునిసిపాలిటీ తెల్దార్‌పల్లిలో రూ. 3.12 కోట్లతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 33 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెల్దార్‌పల్లి అభివృద్ధికి రూ. 16.86 కోట్లు వెచ్చించామని, రూ. 5.25 కోట్లతో 105 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. అలాగే నాగార్జున సాగర్ కాల్వపై రూ. 5 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్లు చెప్పారు.

రాష్ట్రంలో త్వరలో భూముల సమగ్ర సర్వే చేపట్టి, ప్రతి భూమికి క్యూఆర్ కోడ్, మ్యాప్‌తో కూడిన ‘భూధార్’ కార్డులను అందజేస్తామని మంత్రి (Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. ​ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ బాబు, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఏదులాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>