కలం, స్పోర్ట్స్: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) భవితవ్యంపై వెటనర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతడి పేలవ ప్రదర్శన వల్ల భువి అధ్యాయం ముగిసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026లో 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీసిన భువనేశ్వర్.. నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగొచ్చాడు. కానీ న్యూజిలాండ్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఓవర్‌కు 11.50 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ ఫామ్‌కు, అంతర్జాతీయ సిరీస్‌లో అతడి బౌలింగ్‌కు చాలా తేడా ఉందని అశ్విన్ పేర్కొన్నాడు. రన్‌అప్ వేగం, బౌలింగ్ వేగం తగ్గాయని తెలిపాడు.
సరైన సాధనతో సిరీస్‌కు సిద్ధమై ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ ప్రదర్శన తర్వాత భువీకి మరో అవకాశం రావడం కష్టమని వ్యాఖ్యానించాడు. మరోవైపు, మహమ్మద్ షమీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అశ్విన్ చెప్పాడు. ఏడాదిన్నర కాలానికి పైగా భారత జట్టుకు దూరంగా ఉన్న షమీ.. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున మంచి లయతో బౌలింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. డిసెంబర్‌లో శ్రీలంకతో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

