బీజేపీ మహాపాదయాత్ర : నిర్మల్‌ చేరుకున్న సునీల్ బన్సల్

కలం, నిర్మల్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే లక్ష్యంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ మహాపాదయాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సల్ (Sunil Bansal) నిర్మల్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావుతో కలిసి మంగళవారం నిర్మల్‌కు వచ్చారు. హెలిప్యాడ్ వద్ద నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తదితర బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడి నుంచి మహా పాదయాత్ర కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు.

Also Read : జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇళ్లపై ఏసీబీ సోదాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>