ఖమ్మంలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ.. ఆరుగురికి గాయాలు..!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ​తల్లాడ – దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిపై మంగళవారం ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. సత్తుపల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తోంది. హైదరాబాద్ నుంచి తిరువూరుకు వెళ్తున్న డీసీఎం వ్యాన్ మరొక వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ​ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడగా, వారిని మెరుగైన చికిత్స కోసం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, వివరాలను సేకరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>