పులివెందులలో రీపోలింగ్​..! ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

కలం, వెబ్​ డెస్క్: ఏపీ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు (AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసంది. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేస్తూ ఆర్డర్స్​ ఇచ్చింది. పులివెందుల చైర్మన్​ ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. దానిని డిస్మిస్ చేసింది. దీంతో పులివెందుల మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు లైన్​ క్లియర్​ అయింది.

కాగా, పులివెందుల మున్సిపల్​ ఎన్నికల్లో అధికార యంత్రాంగం రిగ్గింగ్​ పాల్పడిందని వైసీపీ ఎంపీ అవినాష్​ రెడ్డి సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్​ దాఖలు చేశారు. రీపోలింగ్​​ పై ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్​ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అనుబంధ పిటిషన్​ ను కొట్టివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>