కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చుతూ, దౌత్యపరమైన చర్చల్లో పురోగతి కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. అయినప్పటికీ సోమవారం అమెరికా.. ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై దాడులు (US Strikes Iran) చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న ఖేష్మ ద్వీపంలో భారీ పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. యూహాత్మకంగా కీలకమైన ఈ ద్వీపంలో భూగర్భ క్షిపణి స్థావరం, నావికా స్థావరం, ఉప్పునీటి శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.
మరోవైపు, మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులు చేసే ఆలోచన లేదని ట్రంప్ తెలిపారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన చర్చల ద్వారా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆశిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఉద్రిక్తతలకు భీజం పడింది. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ప్రయోజనాలపై దాడులు చేయడంతో పాటు హోర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని అడ్డుకుంది. దీంతో అమెరికా ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధనం విధించింది. తాజా దాడులతో (US Strikes Iran) మరోసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి నెలకొంది. అయితే, అమెరికా మధ్యంతర ఎన్నికల ముందు రోజు ఇరాన్ పై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.

