కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో కిరాతకంగా దాడి (Raptadu Incident) చేసిన కేసులో నిందితుడు హేమంత్ కుడి కాలును వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు.
పాఠశాలలో దాడికి పాల్పడిన అనంతరం పరారైన హేమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తుండగా, అతడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో హేమంత్ కాలులోకి బుల్లెట్ దిగింది.
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతున్న నిందితుడి కాలు భాగం దెబ్బతినడంతో, దానిని అలాగే వదిలేస్తే ఇన్ఫెక్షన్ పాకి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో న్యాయస్థానం అనుమతి, ఆదేశాల మేరకు నిపుణులైన వైద్యుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసి హేమంత్ కుడి కాలును తొలగించింది.
Also Read : పులివెందులలో రీపోలింగ్..! ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
Follow Us On : WhatsApp

