ఖమ్మంలో ఘనంగా రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం తెలంగాణ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ (Handball Tournament) ఘనంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ​

ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి సరైన ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అగ్రశ్రేణి క్రీడాకారులుగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. విద్యతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతోపాటు మానసిక పరిపక్వత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కేవలం వినోదానికే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు.

​గెలుపోటములు సహజమని, గెలుపుతో పొంగిపోకుండా, ఓటమితో కుంగిపోకుండా సమానమైన క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల వల్ల ప్రతిభా మార్పిడి జరిగి పోటీతత్వం పెరుగుతుందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు ఇవి మంచి వేదికలని అభివర్ణించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉంచవచ్చన్నారు.

​ఖమ్మం వేదికగా ఇలాంటి రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని, క్రీడా కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>