ఇన్‌స్పెక్టర్ శశిధర్‌కు కేంద్ర హోంమంత్రి దక్షతా పథకం అవార్డు

కలం, కరీంనగర్: విచారణ విభాగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కాసర్ల శశిధర్‌ (Shashidhar Kasarla)కు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు “కేంద్ర హోంమంత్రి దక్షతా పథకం – 2026” లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నం. 155/2019 హత్య కేసులో ఆయన అత్యుత్తమ దర్యాప్తు నిర్వహించారు.

శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో పకడ్బందీగా ఛార్జిషీట్ దాఖలు చేయడంతో కరీంనగర్ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు మొత్తం 15 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,500 జరిమానా విధించింది. ఈ కేసులో ఆయన కనబరిచిన వృత్తిపరమైన నైపుణ్యం, నిబద్ధతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం.. ఇన్‌స్పెక్టర్ కాసర్ల శశిధర్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించడం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన సాధించిన విజయం ఇతర పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>