సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం: ప్రిన్సిపాల్ నవిని

కలం, బోనకల్: భారత ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని (Vallabhbhai Patel Birth Anniversary) పురస్కరించుకొని శనివారం ఖమ్మం జిల్లా బోనకల్లు (Bonakal) ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నవిని శ్రీ అధ్యక్షతన జాతీయ సమాఖ్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశంలో ఉన్న సుమారు 565 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన కృషి వల్ల భారతదేశం ఒక సమైక్య దేశంగా రూపుదిద్దుకోవడానికి మార్గం సుగమమైందని వివరించారు.

అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో పటేల్ విశేష కృషి చేశారని ప్రిన్సిపాల్ కొనియాడారు. రాజ్యాంగ పరిషత్‌లో ప్రాథమిక హక్కులు, మైనారిటీల హక్కులు, గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన సలహా సంఘానికి అధ్యక్షత వహించారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం పరిరక్షణకు తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>