బాధితులకు అండగా BRS నాయకురాలు మనీషా లక్ష్మి

కలం, ​కారేపల్లి: ఖమ్మం జిల్లా ​సింగరేణి (Singareni) మండలంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి (Manisha Lakshmi) శనివారం పర్యటించారు. అనారోగ్యంతో, ప్రమాదాల బారిన పడి బాదపడుతున్న పలువురు వ్యక్తులను పరామర్శించారు. కష్టకాలంలో బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆమె భరోసా కల్పించారు.

​ఈ పర్యటనలో భాగంగా ఆమె ముందుగా భాగ్యనగర్ గ్రామానికి చేరుకుని, ప్రమాదవశాత్తు కాలు ఫ్రాక్చర్ అయిన తన అభిమాని భూక్యా మధు నివాసానికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కారేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సోమందుల నాగరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆయన నివాసానికి వెళ్లారు. నాగరాజును ఆప్యాయంగా పలకరించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు. ​

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వంగడోత్ జగన్, సీనియర్ నాయకులు డోంకేనా రవి, జూంకి, కిల్లారి వెంకటేశ్వర్లు, పెర్రిని, మాజీ సర్పంచులు మోహన్, బన్సీలాల్, మూతి కోటేశ్వరరావు, కృష్ణ, ఉప్ప సర్పంచ్‌లు శంకర్, లాలు, మణికొండ నాగేశ్వరరావు, యువజన నాయకులు జడల కళ్యాణ్, రామారావు, హరీష్, సంపత్, మురళి, వంశీ, కారేపల్లి 10వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>