పీఎం శ్రీ పాఠశాలలో ‘పోక్సో యాక్ట్’పై అవగాహన సదస్సు

కలం, జోగులాంబ గద్వాల: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం గద్వాల (Gadwal) లోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో “సురక్షిత్ బచ్పన్ అభియాన్ – మేరా బచ్పన్ మేర అధికార్” పోగ్రామ్ ద్వారా విద్యార్థులకు చట్టాల రక్షణపై అవగాహన (Legal Awareness Programme) కల్పించారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ సెషన్స్ జడ్జి వి. శ్రీనివాసులు, సెక్రెటరీ జి. నిష్కాపాత్రుడు పాల్గొని మాట్లాడారు.

బాలల హక్కుల పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయం, పోక్సో చట్టం-2012, సోషల్ మీడియా వాడకంలో సైబర్ జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం డీఈఓ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి సునంద మాట్లాడుతూ.. బాలల భవిష్యత్తుకు సమాజమంతా బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో హెచ్‌ఎం బండి విష్ణు, సీడీపీఓ నరసింహులు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ యువతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>