తుఫాన్ క‌ద‌లిక‌ల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాలి: సీఎం చంద్ర‌బాబు

క‌లం, వెబ్‌డెస్క్: అర్న‌బ్ తుఫాన్ చేసిన నష్టం నుంచి ఇంకా కోలుకోని ఏపీకి మ‌రో తుఫాన్ (AP Cyclone) హెచ్చ‌రిక‌లు రావ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ‌ వాయుగుండం రానున్న 24 గంట‌ల్లో తుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మ‌చిలీప‌ట్నానికి ఆగ్నేయంగా సుమారు 1200 కిలో మీట‌ర్ల దూరంలో వాయుగుండం ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ప్ర‌భావంలో ద‌క్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్ర‌ధాన పోర్టుల‌కు తుఫాన్‌ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న మ‌త్స్య‌కారులు ఆదివారం నుంచి వేట‌కు వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించారు. ఈ తుఫాన్ సోమ‌వారం తీరం దాటే అవ‌కాశం ఉంది.

తుఫాన్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు. అర్న‌బ్ తుఫాన్ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టం, క్షేత్ర‌స్థాయిలో కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అధికారులు బంగాళాఖాతంలో మ‌రో అల్ప పీడ‌నం ఏర్ప‌డింద‌ని, రేప‌టి వ‌ర‌కు బ‌ల‌మైన తుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని సీఎంకు వివ‌రించారు. ఈ తుఫాను ప్ర‌భావంతో కోస్తాతో పాటు, రాయ‌ల‌సీమ జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని తెలిపారు. న‌వంబ‌ర్ 2, 3, 4 తేదీల్లో వ‌ర్షాల‌కు అవ‌కాశం ఉన్నందున అధికారులు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. తుఫాను క‌ద‌లిక‌ల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>