నిర్మల్ జీజీహెచ్‌లో అకాడమిక్ విజిట్.. పలు విభాగాలను పరిశీలించిన విద్యార్థులు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన లైఫ్ సైన్స్ విద్యార్థులు (Life Science Students) అకాడమిక్ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డయాలసిస్ యూనిట్, ఐసీయూ, టీ హబ్, రేడియాలజీ విభాగాలను పరిశీలించి వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలపై అవగాహన పొందారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమలత, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్, ఏవో నాగ శ్రీనివాస్, జంతుశాస్త్ర విభాగ అధ్యాపకులు అరుగుల నరేందర్, నుష్రత్ జహాన్, డాక్టర్ రంజిత్ కుమార్, సాదియా, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>