కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై దాడి (Raptadu School Attack) ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాఠశాల ఆవరణలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, విద్యార్థుల రక్షణలో నిర్లక్ష్యం వహించడంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (HM) రాజేశ్వరిని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు హేమంత్ ని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

