epaper
Monday, March 2, 2026
epaper

అనిల్ రావిపూడి.. నెక్ట్స్ టార్గెట్ ఇదే

కలం, వెబ్​డెస్క్​: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో రూపొందిన సినిమా ఇది. పైగా, సంక్రాంతికి వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. జనవరి 12న ఈ భారీ, క్రేజీ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్​కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే మరింత బజ్ పెంచేసింది. ఇదే క్రమంలో అనిల్ నెక్ట్స్ టార్గెట్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.

దీని గురించి అనిల్.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్​లో హింట్ ఇచ్చాడు. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా పెద్ద హిట్ అయితే చరణ్​తో మూవీ ఉంటుందని చెప్పాడు. ఈ సినిమా ట్రైలర్​ను ఫస్ట్ చరణ్​కే చూపించానని, ఆయన ఎక్స్​ట్రార్డినరీగా ఉందన్నారంటూ.. అనిల్ అసలు విషయం బయటపెట్టాడు. అయితే.. చరణ్​తో సినిమా అంటే, అది పాన్ ఇండియా స్థాయి అయ్యుండాలి. అనిల్ ఏమో ఇంత వరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు.

మరి.. నిజంగా చరణ్‌, అనిల్ కాంబో ఉంటుందా అంటే.. ‘మన శంకర వరప్రసాద్’​ గారు బ్లాక్​బస్టర్ అయితే కచ్చితంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పెద్ద హిట్​ సాధిస్తే.. చరణ్​తో పాన్ ఇండియా సినిమా చేయాలని అనిల్​ ముందుగానే ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకనే ఇలా హింట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరుసగా సక్సెస్ సాధిస్తున్నప్పటికీ.. ఏదో లక్ వలన హిట్ అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేసి హిట్ కొట్టి ఆ విమర్శలకు చెక్ పెట్టాలని అనుకుంటున్నాడట. మొత్తానికి అనిల్ నెక్ట్స్ టార్గెట్ అయితే చరణే అని క్లారిటీ వచ్చింది. మరి, అనిల్ అనుకున్నట్లుగా చరణ్​తో మూవీ ఫిక్స్ అవుతుందేమో చూడాలి.

Read Also: సిక్సర్లతో చెలరేగిన సూర్యవంశీ.. సిరీస్​ యువ భారత్​దే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!