కలం, వెబ్ డెస్క్ : భారత క్రికెట్ ఆటగాడు మహమ్మద్ షమి (Mohammed Shami) కి ఈసీ (Election Commission) నోటీసుల జారీ చేసింది. అతడితో పాటు సోదరుడు మహమ్మద్ కైఫ్‌కు కూడా నోటీసులు పంపింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) లో భాగంగా అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిరిస్ట్రేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని నోటీసులో ఈసీ పేర్కొన్నది. వీరిద్దరి ఓటరు నమోదు ఫారాల్లో వ్యత్యాసాలు ఉన్నందున విచారణకు పిలిచింది. అయితే, తాను ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ కోసం రాజ్‌కోట్‌లో ఉన్నందున హాజరుకాలేకపోతున్నానని షమి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
Read Also: రాజాసాబ్ పార్ట్ 2 నిజంగా ఉంటుందా?
Follow Us On : WhatsApp


