కలం, నల్గొండ : నల్గొండ శివారు బత్తాయి మార్కెట్ లో IKP కేంద్రాన్ని (IKP Centre) వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బైరెడ్డి హేమలత వెంకట్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ మద్దతు ధర పొందాలని అన్నారు. ధాన్యం కొనుగోడులో రైతులను ఇబ్బందికి గురి చేస్తే సహించబోమని హెచ్చరించారు. యాసంగిలో కూరగాయల సాగు చేసుకోవాలని, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతుల వరినాట్లు నేసి నష్టపోవద్దన్నారు.
ఆరు తడి పంటలతో ఆదాయం లభిస్తుంది అన్నారు .ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ సిహెచ్ శ్రీనాధరాజు, 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా నాయక్, టౌన్ యూత్ వైస్ ప్రెసిడెంట్ వజ్జ శ్రీనివాస్ యాదవ్, MAO ఎస్ శ్రీనివాస్, AEO అబ్దుల్ వాసే సత్తార్ , కందుల నరేందర్, కన్నెబోయిన రమేష్, గోపగోని నర్సింహా, జల్లెల శ్రీనివాస్, చిన్నాల ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.

