నవంబర్ 1 నుంచి దూరవిద్య తరగతులు ప్రారంభం: గంగాధర్

కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలోని (Nirmal) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ (Ambedkar Open University) అధ్యయన కేంద్రంలో 2026-27 దూరవిద్యకు సంబంధించి డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల తరగతులు నవంబర్ 1 (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నట్లు అధ్యయన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ యు. గంగాధర్ శుక్రవారం తెలిపారు. ప్రతి ఆదివారం నిర్వహించే కౌన్సెలింగ్‌ తరగతుల్లో విద్యార్థులు చదువుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిష్ణాతులైన కౌన్సిలర్లు, అధ్యాపకులతో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దూరవిద్య విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>