కలం, సారంగాపూర్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో నవంబర్ 3వ తేదీ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్ర (BJP Maha Padayatra) ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్ పిలుపునిచ్చారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగే మహా పాదయాత్ర(BJP Maha Padayatra)కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కాల్వ నరేశ్, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Also Read : మాజీ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
Follow Us On : WhatsApp

