epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాజాసాబ్ పార్ట్ 2 నిజంగా ఉంటుందా?

కలం, వెబ్​ డెస్క్​ : బాహుబలి సినిమాను రెండు పార్టులుగా తీయడం.. ఆ సినిమా చరిత్ర సృష్టించడం తెలిసిందే. దీంతో ఒక కథను రెండు పార్టులుగా తీయడం అనేది ట్రెండ్ అయ్యింది. పుష్ప, పుష్ప 2, కేజీఎఫ్, కేజీఎఫ్ 2, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2, సలార్, సలార్ 2, కల్కి, కల్కి 2.. ఇలా సీక్వెల్స్ రావడం ఎక్కువైంది. ముఖ్యంగా ప్రభాస్ సినిమా అంటే.. రెండు పార్టులు కామన్ అయ్యింది. ఇప్పుడు రాజాసాబ్ అంటూ వస్తున్నాడు. అయితే.. ఈ మూవీకి కూడా సీక్వెల్ ఉందని గతంలో అన్నారు. మరి.. నిజంగా రాజాసాబ్ 2 (Raja Saab Part 2) ఉంటుందా..?

ప్రభాస్ (Prabhas) కల్కి, సలార్ సినిమాలు చేయడం.. ఈ రెండు సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేయడం తెలిసిందే. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తారా..? సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని ఆయా డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫౌజీ సినిమాకి కూడా సీక్వెల్ ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే.. ఈ మూవీ సీక్వెల్ గురించి మారుతి (Director Maruthi) ని అడిగితే.. ట్రైలర్ లో చూపించిన జోకర్ షాట్ పార్ట్ 2 కు లీడ్ ఇవ్వడం కోసమే పెట్టినట్టు చెప్పాడు. దీనిని బట్టి రాజాసాబ్ పార్ట్ 2 ఉందని విషయం అర్ధమౌతుంది. మరి.. వెంటనే స్టార్ట్ చేస్తారా..? కాస్త టైమ్ తీసుకుంటారా అంటే.. మారుతి ఒక సినిమా చేసి ఆతర్వాత ప్రభాస్ డేట్స్ ను బట్టి రాజాసాబ్ పార్ట్ 2 చేయాలి అనుకుంటున్నారట.

ప్రస్తుతానికి పార్ట్ 2 కు సంబంధించి కథ రెడీగా లేదట. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి పార్ట్ 2 రాయాలి అనేది మారుతి ఆలోచన అని సమాచారం. అలాగే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 విషయంలో ప్రభాస్ కు కూడా ఫుల్ క్లారిటీ ఉందని మారుతి అసలు విషయం బయటపెట్టారు మారుతి. ఓ సందర్భంలో నిర్మాత విశ్వప్రసాద్.. రాజాసాబ్ వరల్డ్ కంటిన్యూ అవుతుందని చెప్పారు. దీనిని బట్టి రాజాసాబ్ కు పార్ట్ 2 మాత్రమే కాదు.. అంతకు మించి అనేట్టుగా సిరీస్ లా చేయాలి అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి.. రాజాసాబ్ (Raja Saab Part 2) ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎన్ని సిరీస్ లు వస్తాయో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read Also: ఆ ఇద్దర్ని టెన్షన్ పెడుతున్న రాజాసాబ్..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>