కలం, వెబ్ డెస్క్ : గుజరాత్లోని బనస్కంతా జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ (PM Modi) పీఎం కిసాన్ 24 విడత (PM Kisan) నిధులను విడుదల చేశారు. ఈ విడత కింద దేశవ్యాప్తంగా సుమారు 9.34 కోట్లకు పైగా అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లో రూ. 18,680 కోట్లకు పైగా మొత్తాన్ని నేరుగా జమ చేశారు. ఇందులో భాగంగా ఒక్కో రైతు ఖాతాకు రూ. 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, బీజేపీ సుపరిపాలన వల్ల దేశంలో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, భారతీయ రైతులపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని ప్రధాని వెల్లడించారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి, వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 16 లక్షల కోట్లకు పైగా ఎరువుల సబ్సిడీ కోసం వెచ్చించిందని వివరించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాంకేతికతను జోడించి నేరుగా లబ్ధిదారులకు నిధులు చేరేలా పారదర్శక వ్యవస్థను రూపుదిద్దామని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు.
Also Read : భూటాన్లో బద్దలైన గ్లేసియర్ సరస్సు.. భారత్కు హై అలర్ట్!
Follow Us On: X(Twitter)

