యాదాద్రిలో మరో అభివృద్ధి ఘట్టం.. నూతన కళ్యాణ మండపానికి భూమిపూజ

కలం, యాదగిరిగుట్ట : తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో (Yadadri Temple) అభివృద్ధి ప్రస్థానానికి మరో ముందడుగు పడింది. కొండపైన స్వామివారి దివ్యసన్నిధిలో నూతన కళ్యాణ మండప (Kalyana Mandapam) నిర్మాణానికి భూమిపూజ (Bhoomi Pooja) నిర్వహించడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. యాదాద్రి క్షేత్రం ఇప్పటికే తన విశిష్ట నిర్మాణశైలి, శిల్పకళా వైభవంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఈ నేపథ్యంలో కొండపైన మరో నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా నిర్మించనున్న ఈ కళ్యాణ మండపం భవిష్యత్తులో ఆలయ వైభవంలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవస్థాన చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన నిర్మాణానికి అంకురార్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, దేవస్థాన బోర్డు సభ్యులు టి. విజేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ, గుండు మల్లయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, దేవస్థాన ఈవో జె. భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి క్షేత్ర అభివృద్ధిలో ప్రతి అడుగు భక్తుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవాలనే ఆశాభావం వ్యక్తమవుతోంది. నూతన కళ్యాణ మండప నిర్మాణం కూడా ఆలయ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మరింత ఇనుమడింపజేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>