కలం, వెబ్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు (Baddukonda Appalanaidu) నేడు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. ఇటీవల ఆయన వియ్యంకుడు, విజయనగరం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిపోయారు.
అయితే చిన్న శ్రీను టీడీపీలో చేరిన వెంటనే బడ్డుకొండ అప్పలనాయుడి(Baddukonda Appalanaidu)ని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగించడమే కాకుండా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో సస్పెండ్ చేసింది. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన బడ్డుకొండ, వైఎస్సార్సీపీ అధిష్ఠానం వైఖరిపై విమర్శలు గుప్పిస్తూ పార్టీకి రాజీనామా చేసి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
1995లోనే సర్పంచ్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా సేవలు అందించిన తనకు టీడీపీతో పాత అనుబంధం ఉందని ఈ సందర్భంగా బడ్డుకొండ గుర్తుచేసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అప్పలనాయుడు స్పష్టం చేశారు.
కాగా, బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల (Nellimarla) నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి సారి 2009లో కాంగ్రెస్ పార్టీ తరుఫున , రెండో సారి 2019లో వైఎస్సార్సీపీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాదించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి టీడీపీలో చేరడంతో విజయనగరం జిలాల్లో కూటమి బలం మరింతగా పెరగాగ.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఇది కోలుకోలేని దెబ్బగా మారింది.
Also Read : కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. స్థానికుల్లో హై టెన్షన్!
Follow Us On : WhatsApp

