కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. స్థానికుల్లో హై టెన్షన్!

కలం, వెబ్ డెస్క్ : కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో (Machavaram Gas Leak) వరుసగా జరుగుతున్న గ్యాస్ లీకేజీ ఘటనలు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన ఓఎన్జీసీ పైప్‌లైన్ లీకైన ప్రాంతంలోనే, గురువారం రాత్రి నుండి మరలా గ్యాస్ బయటకు వస్తున్నట్లు పొలాల్లో పనిచేసే స్థానికులు గుర్తించారు. ఒకే ప్రదేశంలో స్వల్ప వ్యవధిలోనే రెండోసారి లీకేజీ ఏర్పడటంతో మాచవరం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ, శాశ్వత పరిపరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే ఓఎన్‌జీసీ నిపుణుల (ONGC Experts) బృందం కూడా రెస్క్యూ వాహనాలతో రంగంలోకి దిగి లీకేజీని అదుపు చేసేందుకు శ్రమిస్తోంది. పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఆంక్షలు విధించారు. అయితే, ఈ ఘటన(Machavaram Gas Leak)పై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సాంకేతిక లోపాన్ని త్వరలోనే సరిచేసి పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పైప్‌లైన్ వ్యవస్థను సమగ్రంగా తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read : NH-16పై వరద బీభత్సం: 10 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>