NH-16పై వరద బీభత్సం: 10 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్!

కలం, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలో బాహుదా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జాతీయ రహదారి-16పై భారీగా వరద (NH 16 Floods) నీరు చేరింది. ఇచ్చాపురం హైవేపై వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని ప్రభావంతో హైవేపై దాదాపు 10 కిలోమీట‌ర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు నరసన్నపేట, టెక్కలి, పలాస హైవేల వద్దే వాహనాలను నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా నరసన్నపేట వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇచ్చాపురం వైపు వెళ్లేందుకు వీలు లేని పరిస్థితి నెలకొంది. వరద ఉధృతి పూర్తిగా తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read : ఈసీ కీలక నిర్ణయం.. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>