కలం, బోథ్: బోథ్ ఎక్స్ రోడ్డు 44 జాతీయ రహదారి వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల (సులభ్ కాంప్లెక్స్) పనులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (Anil Jadhav) గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత వారికి సూచించారు. త్వరలోనే మరుగుదొడ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం ఇటీవలే హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే (Anil Jadhav) పేర్కొన్నారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఉపసర్పంచ్ గులాబ్, ప్రీతం రెడ్డి, దేవేందర్ రెడ్డి, వెంకట్రావు, సుజీల్, గాడ్గే సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

