కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఆలయ కమిటీ, ప్రజా ప్రతినిధులు ఆహ్వానించారు.
అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరణ..
ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో జరిగే మేడారం మహా జాతర పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ పూజారులు మేడారం జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read Also: కేటీఆర్ పర్యటనకు ముందే బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
Follow Us On: Pinterest


