కొండా సురేఖ సారీ.. కేటీఆర్ ఏమన్నారంటే!

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కొండా సురేఖ తనకు సారీ చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ‘నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. మొన్న ఒక పత్రిక నాకు సారీ చెప్పింది. ఈ రోజు మేడం (కొండా సురేఖ) క్షమాపణలు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ, విద్యుత్తు కుంభకోణం.. ఇలా నా మీద తప్పుడు ఆరోపణలు చేసిన వారు కచ్చితంగా భవిష్యత్తులో సారీ చెబుతారు. నా మీద ఆరోపణలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. లీగల్ టీంతో చర్చించిన తరువాత ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచించుకుంటాం’ అన్నారు.

సమంత, నాగచైతన్య, కేటీఆర్‌(KTR)ను ఉద్దేశించి కొండా సురేఖ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ(Konda Surekha)పై లీగల్, పరువు నష్టం కేసులను దాఖలు చేశారు. రేపు మరోసారి కోర్టులో విచారణకు రాబోతున్న నేపథ్యంలో కొండా సురేఖ ఒక రోజు ముందుగానే ఎక్స్ వేదికగా సారీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అక్కినేని నాగార్జున సైతం కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు.

Also Read : ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నది ముఖ్యం: టీపీసీసీ చీఫ్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>