నీటిని వృథా చేయొద్దు.. బాధ్యతగా వినియోగించాలి: నిర్మల్ చైర్‌పర్సన్

కలం, నిర్మల్‌: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నిర్మల్ (Nirmal) పట్టణంలో తాగునీటి వినియోగం, పొదుపు (Water Conservation) పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్ పర్సన్ అప్పాల కావ్య గణేష్‌ చక్రవర్తి సూచించారు. నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పట్టణ అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ప్రతి వార్డులో నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంటింటా నీటిని బాధ్యతాయుతంగా వినియోగించేలా చైతన్యపరచాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు, వర్షపాతంలో హెచ్చుతగ్గుల నేపథ్యంలో నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లోని తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, మౌలిక వసతుల సమస్యలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేష్‌ చక్రవర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>