కలం, సినిమా: హారిక హాసిని బ్యానర్లో విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఫుల్ ఫన్ అండ్ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. అలాగే నివేదా పేతురాజ్, నారా రోహిత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. మూవీ టీమ్ అంతా ఈ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. ఈ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. డైరెక్టర్ త్రివిక్రమ్ హీరోయిన్ శ్రీనిధి కాళ్లు మొక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే శ్రీనిధి (Srinidhi Shetty) వెంటనే వెనక్కి జరిగి ఆ తర్వాత త్రివిక్రమ్ కాళ్లకు నమస్కరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు త్రివిక్రమ్ లాంటి పెద్ద డైరెక్టర్ హీరోయిన్ కాళ్లకు ఎందుకు నమస్కారం చేశాడంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
శ్రీనిధి చాలా ఫ్రెండ్లీ అని త్రివిక్రమ్ (Trivikram) అన్నారు. తాను ఇప్పటి వరకు పని చేసిన హీరోయిన్లలో తాను అందరికంటే ఫ్రెండ్లీ అని చెప్పారు. ఇక తనతో పని చేసే వాళ్లతో స్నేహితుల్లా కలిసిపోతానని, శ్రీనిధి కూడా తనతో కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయిందని చెప్పుకొచ్చారు. అందుకే ఆరోజు సరదాగా అలా చేశానని, అంతకు మించి వేరే ఏ ఉద్దేశం లేదని తెలిపారు. ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30న శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంది.
Also Read : జోకో జోరు.. హంబర్ట్‌పై సంచలన విజయం!
Follow Us On: Instagram

