డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కార దిశగా అడుగులు.. తొలి విడతగా రూ.17 కోట్లు

కలం, కరీంనగర్ : కరీంనగర్ నగరవాసులను దశాబ్ద కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న డంపింగ్ యార్డ్ (Karimnagar Dumping Yard) దుర్గంధం, కాలుష్య సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారదిశగా అడుగులు లభించింది. “డంపింగ్ యార్డ్‌కు ఇక బై.. బై..” అని చెప్పే రోజు రానే వచ్చింది. గతంలో కరీంనగర్ పర్యటన సందర్భంగా నగర ప్రజలకు ఇచ్చిన మాటను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిలబెట్టుకున్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరంతర కృషి, పట్టుదలతో ఈ సుదీర్ఘ సమస్యకు విముక్తి కోసం ముందడుగు డంపింగ్ యార్డ్‌లోని వ్యర్థాల తొలగింపు (బయో మైనింగ్), నగర పారిశుద్ధ్య ఆధునీకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ. 17 కోట్ల నిధులను మంజూరు చేసింది.

మాట నిలబెట్టుకున్న ‘కమలం’ పార్టీ

కరీంనగర్ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కరీంనగర్ పర్యటనకు వచ్చిన సందర్భంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమస్య తీవ్రతను గ్రహించి, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారమే స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ. 17 కోట్లు విడుదల చేయడంతో కరీంనగర్ ప్రజల నమ్మకాన్ని కమలం పార్టీ నిలబెట్టుకుందని స్థానికులు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డంపింగ్ యార్డ్ కోసం కోతిరాంపూర్ చౌరస్తాలో ఘనంగా సంబరాలు

దశాబ్దాల నాటి తీవ్రమైన రోగాల బారి నుండి, దుర్గంధం నుండి ఉపశమనం లభించనుండడంతో బీజేపీ కార్పొరేటర్ మాసం గణేష్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ సమీపంలో వివిధ వర్గాల ప్రజలు, స్థానికులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ మాసం గణేష్ మాట్లాడుతూ..కరీంనగర్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుందని నగరవాసులకు నరకం చూపించిన డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సహాయ పడిన కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ కుమార్, మేయర్ కోలగాని శ్రీనివాస్, నగరపాలక సంస్థ ప్రతినిధులకు, అధికారులకు, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం స్వచ్ భారత్ మిషన్ కింద 17 కోట్ల నిధులు మంజూరు కావడంతో బయో మైనింగ్ ప్రక్రియ శరవేగంగా పూర్తవుతుందని, రానున్న రోజుల్లో 80 కోట్ల నిధులతో డంపింగ్ యార్డ్ కు శాశ్వత విముక్తి లభించనుందని తెలిపారు. అతి త్వరలోనే కరీంనగర్ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సుందర నగరంగా మారడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

డంపింగ్ యార్డ్ పై బీఆర్ఎస్ ఇంకా రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గుండాలి…

డంపింగ్ యార్డ్ విషయంలో అనవసర రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సిగ్గు ఉండాలని కార్పొరేటర్ మాసం గణేష్ ఘాటుగా విమర్శించారు. గత పదేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, కరీంనగర్ మూడుసార్లు ఎమ్మెల్యే , రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ డంపింగ్ యార్డ్ తరలింపు విషయంలో నిర్లక్ష్యం గా వ్యవహరించి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కరీంనగర్ డంప్ యార్టును మరణ శాసనమ్‌ల తయారు చేసింది ఎవరని ? గత దశాబ్ద కాలంగా డంపింగ్ యార్డ్ సమస్య కోసం ప్రజలంతా శాశ్వతంగా పరిష్కారానికి మార్గాలు చూపమని కోరితే కేటీఆర్, కేసీఆర్‌ వచ్చినప్పుడల్లా అర్దారత్రుళ్ళు అరెస్టులు చేసి నియంత పాలన కొనసాగించారన్నారు.

పార్టీ జెండాలు పక్కన పెట్టి ప్రజల అరోగ్యం, జీవితాన్ని కాపాడుకోవడానికి గత బీఆర్ఎస్‌ను ప్రాధేయపడితే చేసింది ఏంటి . ప్రశ్నిస్తే గత బీఆర్‌ఎస్ నాయకులతో అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా..అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ కృషితో ఇప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారమైతే చూసి ఓర్వలేక మళ్ళీ చిల్లర రాజకీయలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. ఇకనైనా బీఆర్‌ఎస్ నేతలు పనికిమాలిన రాజకీయాలు మానుకొవాలనీ హెచ్చరించారు.

నగర ప్రజల నమ్మకాన్ని బిఆర్ఎస్ పూర్తిగా కోల్పోయిందని, ప్రజల నమ్మకంతోనే బల్దియా ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారని, ప్రజలు బీజేపీ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుంటే జీర్ణించుకోలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ తన బుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు ఏపీపీ చంద్ర, తోట అనిల్, మ్యకల వెంకటేష్ , మహిళలు బీజేపీ నాయకులు వివిధ డివిజన్ ప్రజలు , ఆటోనగర్ ప్రజలు, ఆటో యూనియన్ నాయకులు బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>