స్వీట్స్ ల‌వ‌ర్స్‌కి బిగ్ షాక్‌.. తీపి వెనుక చేదు నిజాలు!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఫ‌ర్ ఫుడ్ అండ్ ఎసెన్షియ‌ల్ డ్ర‌గ్స్‌ (TGSAFE) అధికారులు తాజాగా హైదరాబాద్‌లోని పలు ప్రముఖ స్వీట్ షాపులు, బేకరీలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరవ్యాప్తంగా 16 స్వీట్ షాపులు, త‌యారీ కేంద్రాల్లో సోదాలు నిర్వ‌హించారు. ఆయా షాపుల్లో తీవ్ర అపరిశుభ్ర వాతావ‌ర‌ణం ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. స్వీట్లు త‌యారు చేసే ద‌గ్గ‌రే ఎలుక‌లు, బొద్దింక‌లు వంటివి తిరుగుతున్న‌ట్లు గ‌మ‌నించారు. అలాగే డేట్ అయిపోయిన ఆహార ప‌దార్థాలు కూడా అమ్ముతున్న‌ట్లు అధికారుల విచార‌ణ‌లో తేలింది. ఈ తనిఖీల్లో మొత్తం రూ. 16.8 లక్షల విలువైన 3,546.5 కిలోల కలుషిత ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

ఇక స్వీట్ల‌కు ఫేమ‌స్ అయిన‌ జీ పుల్లారెడ్డి స్వీట్స్ (Pulla Reddy Sweets) స‌న‌త్ న‌గ‌ర్ బ్రాంచ్‌, ఆగ్రా మిఠాయి ఘర్ చార్మినార్ బ్రాంచ్‌, వ‌న‌స్థ‌లీపురంలోని స్వీటోన్, ఫ‌ల‌క్‌న‌మాలోని బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్, హిరాణీ ఫుడ్స్, మినర్వా స్వీట్స్‌తో పాటు మొత్తం ఐదు సంస్థల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్‌లను అధికారులు సస్పెండ్ చేశారు. క‌రాచీ బేక‌రీతో స‌హా మరో ఏడు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సరైన లైసెన్స్‌లు లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో మ‌రికొన్ని స్వీట్ షాపులు, బేక‌రీల‌ను మూసివేయించారు. అధికారులు ఈ దాడుల్లో భాగంగా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 22 చోట్ల శాంపిల్స్ సేక‌రించి ల్యాబ్ ప‌రీక్ష‌ల‌కు పంపించారు. వాటి ఫ‌లితాల ఆధారంగా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

Also Read : మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ: కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>