కలం, వెబ్ డెస్క్: రాష్ట్రమంతా కరువులో ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ.లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ (Musi Rejuvenation) చేపట్టేందుకు సిద్దమవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తమకు ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, మూసీని సుందరీకరిస్తామంటూ భారీగా భూ దోపిడీకి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. అందుకే, పబ్లిక్ హియరింగ్ అంటేనే భయపడుతున్నారని తెలిపారు. ఇంతవరకు డీపీఆర్‌ను కూడా సిద్ధం చేయలేదని.. దీన్ని బట్టి కుంభకోణం తెలిసిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు, నీళ్ల ఇక్కట్లతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అన్నారు.
ఐటీ కంపెనీలకు కరెంట్ బంద్..
హైదరాబాద్ నగరంలోని ఐటీ కంపెనీలకు ఆరు గంటల తరువాత కరెంట్ బంద్ పెడుతున్నారని కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇప్పటికే పరిశ్రమలకు కరెంట్ కోతలు అమలవుతున్నాయని వివరించారు. గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ల ఎత్తిపోతలు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్యాంకర్ల ఎత్తిపోతలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక చేసిన ఒక్క మంచి పని అయినా చెప్పగలరా.. అని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా లోటు వర్షపాతం ఉందని.. కానీ అప్పట్లో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు రాలేదన్నారు. గోదావరిలో వరద పారుతున్నా.. ఎందుకు ఎత్తిపోయలేదని ప్రశ్నించారు.
Also Read : రేషన్ బియ్యం పాలిష్.. సన్న బియ్యంగా సేల్!
Follow Us On: Instagram

