లైటింగ్, గ్రీనరీ, ఫుడ్‌ జోన్‌.. వడ్డేపల్లి బండ్‌పై ప్రత్యేక దృష్టి

కలం, హనుమకొండ: వడ్డేపల్లి చెరువు బండ్‌ (Waddepally Lake Bund) అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారి చాహత్‌ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.

గురువారం జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్నతో కలిసి ఆమె బండ్‌పై జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిటైనింగ్‌ వాల్‌, గ్రిల్స్‌, టైల్స్‌, వాష్‌రూమ్‌లు, విద్యుత్‌ దీపాలు, పెయింటింగ్‌, జిమ్‌, ప్రహరీ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.

ఫుడ్‌ జోన్‌ వద్ద సీటింగ్‌ ఏర్పాట్లు, వాల్‌ పెయింటింగ్‌, గ్రీనరీ, పిల్లల ఆట స్థలానికి అవసరమైన సదుపాయాలపై అధికారులకు సూచనలు చేశారు. ఫుడ్‌ కోర్టులకు రంగులు వేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరగా సమర్పించాలని, బండ్‌ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు పచ్చదనాన్ని పెంచాలని కలెక్టర్‌ సూచించారు. విద్యుత్‌ దీపాలకు సంబంధించిన పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటనలో జీడబ్ల్యూఎంసీ ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈ రవికుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>