కలం, ఇంద్రవెల్లి: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీర యోధుడు కొమురం భీమ్ (Komaram Bheem) అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమురం భీమ్ ఆశయాలు, ఆదివాసీల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
ఆదివాసీ సమాజ అభ్యున్నతి, గిరిజనుల హక్కుల పరిరక్షణలో కొమురం భీమ్ పోరాట స్ఫూర్తి ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో మహేందర్, ఎంపీవో సంజీవ్ రావు, కొమురం భీమ్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మెస్రం నాగ్‌నాథ్, కేస్లాపూర్ రాయిసెంటర్ సార్‌మెడి మెస్రం వెంకటరావు పటేల్, గిన్నేరా రాయిసెంటర్ సార్‌మెడి మెస్రం దుర్గ, ఇంద్రవెల్లి సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, ఆదివాసీ నాయకులు పూర్క చిత్రు, కనక తుకారామ్, జుగాదిరావు, గేడం భరత్, సుంకట్ రావు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

