కలం, వెబ్ డెస్క్ : సినిమాల్లోకి వెళ్లాలి అనుకునేవారికి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె (Deepika Padukone) ఛాన్స్ ఇస్తానని చెబుతోంది. నేడు ఆమె 40వ బర్త్ డే వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దీపిక తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆన్ సెట్’ ను అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా సినిమాల్లో, టీవీ షోల్లో పనిచేయాలి అనుకునే వారికి అవకాశాలు ఇస్తున్నట్టు తెలిపింది. కాకపోతే ప్రస్తుతానికి టెక్నికల్ డిపార్టుమెంట్ లోనే ట్రైనింగ్ ఇస్తామని చెబుతోంది. ఇందుకోసం ఇంట్రెస్ట్ ఉన్న వారు తన డిపార్టెమెంట్ కు ప్రొఫైల్ పంపాలని.. ఏ డిపార్టుమెంట్ లో ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో అందులో మెన్షన్ చేయాలని చెప్పింది దీపిక పదుకొణె.
ఈ డిపార్టుమెంట్ లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత తామే ఛాన్స్ ఇస్తామని వివరించింది దీపిక. సౌండ్, డిజైన్, ఆర్ట్ అండ్ ప్రొడక్షన్, డైరెక్షన్ ఫీల్డ్ వారికే ప్రస్తుతానికి కోర్సులు ఇస్తున్నామని.. త్వరలోనే యాక్టింగ్ చేయాలి అనుకునే వారికి కూడా ఛాన్స్ ఇస్తామని దీపిక పదుకొణె (Deepika Padukone) తెలిపింది. దీంతో దీపికకు ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ తో పాటు ప్రాజెక్టు గురించి డబుల్ విషెస్ చేస్తున్నారు.
Read Also: అనిల్ రావిపూడి.. నెక్ట్స్ టార్గెట్ ఇదే
Follow Us On: Pinterest


