స్పెయిన్​లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి..!

కలం, వెబ్​ డెస్క్​ : స్పెయిన్​ లో ఘోర రైలు ప్రమాదం (Spain Train Accident) చోటు చేసుకుంది. బుధవారం స్పెయిన్‌లోని టోలెడో మధ్య ప్రావిన్స్‌లో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో 46 మందికి పైగా మరణించారు. ప్రమాదం కారణంగా సియుడాడ్ రియల్, అండలూసియాతో కలిపే రైలు సర్వీసులను నిలిపివేశారు.

రెండు రైళ్లు ఒకే రూట్​ లో ప్రయాణిస్తుండగా, ఒకటి మరొకదాని వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు రైళ్లు పట్టాలు తప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనం వెలువడుతోంది. ప్రమాదంపై స్పందించిన స్పెయిన్​ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Also Read : స్మిత్ మచ్చర్‌కు యూఏఈ పుర‌స్కారం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>