కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌లోని మాధవనగర్, అర్సపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. మాధవనగర్ ఆర్ఓబీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 13 విడతల్లో రూ.42 కోట్ల నిధులు కేటాయించిందని వివరించారు.
అర్సపల్లి ఆర్ఓబీకి కూడా రూ.11 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. అయినప్పటికీ కొంత మంది నాయకులు అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల సౌకర్యార్థం ఆర్ఓబీల నిర్మాణాలను నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులకు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు గడువు విధించారు.

