స్టాక్ మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ!

కలం, వెబ్ డెస్క్ : భారత స్టాక్ మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ అరంగేట్రం (Jio Platforms Listing) చేసింది. అక్టోబర్ 28న మార్కెట్లలో లిస్ట్ అయిన ఈ కంపెనీ షేర్లు ఏకంగా 21.4 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ను ప్రారంభించి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఒక్కో షేరు ఆఫర్ ధర రూ.1,119 కాగా, బిఎస్ఈ, ఎన్ఎస్ఇలలో రూ.1,358 వద్ద లిస్ట్ అయింది.

ఈ బిగ్ బాంగ్ లిస్టింగ్ ద్వారా జియో ప్లాట్‌ఫార్మ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా రూ.12.6 లక్షల కోట్లకు చేరింది. దీంతో దేశంలోనే రెండవ అత్యంత విలువైన కంపెనీగా జియో అవతరించింది. అలాగే, ఇప్పటివరకు టెలికాం రంగంలో అగ్రస్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్‌ను మార్కెట్ క్యాప్‌లో అధిగమించి, భారతదేశంలోనే అత్యంత విలువైన టెలికాం కంపెనీగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయంతో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా తన స్థానాన్ని మరింత సుదృఢం చేసుకుంది.

Also Read : అభిషేక్‌-వైభవ్‌ విధ్వంసం.. భారత్‌ మూడు ప్రపంచ రికార్డులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>