కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ‘అర్నబ్’ తుఫాన్ (Arnab Cyclone) ప్రభావం వల్ల పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీ శ్రేణులకు , నాయకులకు కీలక పిలుపునిచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసరంగా అండగా నిలవాలని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ముంపు ముప్పు ఉన్న లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
ఈ మేరకు బాధితుల క్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని పేర్కొంటూ, పునరావాస సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలకు ఆహారం, తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలు సమకూరేలా చూడాలని నాయకులకు నిర్దేశించారు. అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్న ప్రభుత్వ సిబ్బందికి జనసేన కార్యకర్తలు పూర్తిగా సహకరించాలని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోరారు. ఈ విపత్తు సమయంలో మానవత్వంతో స్పందించి, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ ఉపశమనం అందించడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్ఫార్మ్స్ బ్లాక్బస్టర్ ఎంట్రీ!
Follow Us On: X(Twitter)

