కలం, వెబ్‌డెస్క్: ఒమన్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లి శద్ధ అయ్యర్ (Shraddha Iyer) అనే భారతీయ మహిళ మృతి చెందారు. స్నేహితులతో కలసి జెబెల్ షామ్స్ ఏరియాలోని వాడి గుల్ పర్వత ప్రాంతాలకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన శ్రద్ధ(52) ఈ నెల 2న అక్కడ జరిగిన ప్రమాదంలో చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఒమర్ ఎయిర్‌లో పనిచేసి, ప్రస్తుతం మస్కట్‌లో నివసిస్తున్న శ్రద్ధ సొంతూరు కేరళలోని థాలవ. ప్రసిద్ధ అగ్రికల్చరల్ సైంటిస్ట్, దివంగత ఆర్డీ అయ్యర్, రోహిణి అయ్యర్ దంపతుల కుమార్తె. శ్రద్ధ సోదరి చిత్ర అయ్యర్ సింగర్‌గా పనిచేస్తున్నారు. ఆర్డీ అయ్యర్ నిరుడు డిసెంబర్ 11న మృతి చెందగా, థాలవలో జరిగిన ఆయన అంత్యక్రియలకు హాజరైన శ్రద్ధ.. అనంతరం అదే నెల 24న తిరిగి మస్కట్‌కు వెళ్లిపోయారు. కాగా, శద్ధ అంత్యక్రియలు ఈ నెల 7న థాలవలో జరపనున్నారు. శ్రద్ధ గురించి సోదరి చిత్ర అయ్యర్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఎమోషనల్ మెసేజ్ ట్రెండ్ అవుతోంది.

Read Also: అమెరికా హత్య కేసు నిందితుడు అరెస్ట్
Follow Us On: Pinterest


