కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వారణాసి” (Varanasi). ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత రాజమౌళి, మహేష్ కాంబినేషన్ సెట్ అవటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు తారా స్థాయికి తీసుకెళ్ళింది. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ సైతం ఈ సినిమాలో ఆన్ బోర్డ్ అయ్యారు.
ఇదిలా ఉంటే బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న వారణాసి మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. వారణాసి (Varanasi) మూవీని ఏప్రిల్ 9, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. శ్రీరామ నవమి సందర్భంగా సినిమాను రిలీజ్ చేసినట్లయితే లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉంటుందని రాజమౌళీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.
Read Also: సినిమాల్లోకి వెళ్లాలనుకునే వారికి ఛాన్స్ ఇస్తున్న దీపిక పదుకొణె
Follow Us On : WhatsApp


